మంత్రివర్గ మార్పు దిశగా ప్రధాని

Google+ Pinterest LinkedIn Tumblr +

కేంద్రమంత్రి వర్గంలో మార్పులు జరగనున్నాయా? ఇప్పుడు ఇదే వార్త హాట్‌టాపిక్‌గా మారింది. ప్రధాని ఇదే అంశంపై అన్ని కోణాల్లో ఆలోచించాకే మంత్రి వర్గ విస్తరణ జరుగునుందని మేధావి వర్గం చెబుతుంది. నరేంద్రమోడీ తాజాగా బీజేపీ అగ్రనేతలతో వరుసగా సమావేశమవుతున్నారు.

ఇప్పటి మంత్రివర్గంలో పని చేస్తున్న నేతల పని తీరును అంచనా వేస్తూ వారికి ప్రోత్సాహాకాలు ఇచ్చే పనిలో ప్రధాని ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ విలువలు కాపాడడం, మిత్రపక్షాల ఆంక్షలను నేరవేర్చడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు మోడీ. ఇక ఇలాంటి అంశాల్లో బాగా పనిచేసిన 30 మంది నేతల పేర్లను లీస్టుగా మోడీ తయారుచేసినట్లు స్పష్టమవుతోంది.

కేంద్రమంత్రివర్గంలోకి 79 మందిని తీసుకోవడానికి అవకాశం ఉండడంతో ప్రస్తుతం మాత్రం 53 మందినే పరిశీలనలో ఉంచారట ప్రధాని. త్వరలో చేయనున్న ఈ మంత్రి వర్గవిస్తరణలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, సదానంద గౌడ వంటి పార్టీ నేతలతో సమావేశమయ్యారు మెడీ.

 

Share.

Comments are closed.

%d bloggers like this: