టీపీసీసీగా రేవంత్ రెడ్డి?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ పీసీసీ పదవి కాస్త కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం ఢిల్లీకి పయనమయ్యారు ఎంపీ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. పీసీసీ ఎంపికపై ఏఐసీసీ కసరత్తు చేస్తున్న క్రమంలోనే వీరు ఢిల్లీ వెళ్లారని పార్టీ వర్గాల చెబుతున్నాయి. పీసీసీ రేసులో ముందు వరుసలో ఉన్నారు మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.

ఇక ఈయనతో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డినే పీసీసీ ప్రెసిడెంట్‌గా నియమించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మనిక్కం ఠాగూర్ సైతం పీసీసీ రేవంత్ రెడ్డి పేరునే ప్రతిపాదించినట్లు సమాచారం.

ఇదే విషయంపై రేపో మాపో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిలను ఏఐసీసీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక అసంతృప్తి నేతలను బుజ్జగించే బాధ్యతను జానారెడ్డి ,షబ్బీర్ అలీ ,జీవన్ రెడ్డిలకు ఇచ్చారట.

 

Share.

Comments are closed.

%d bloggers like this: