కరోనా వేళ విజయ్‌సేతుపతి భారీ విరాళం

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశ వ్యాప్తంగా కరోన కేసులు విపరీతంగా పెరిగి ఎంతో మంది మరణిస్తున్నారు. దీంతో ఆదుకునేందుకు సినిమా పరిశ్రమలోని ప్రముఖులు ముందుకొస్తున్నారు. చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటులైన సోనూసూద్, చిరంజీవి వంటి ప్రముఖుల చాలా మంది ముందుకొచ్చారు. సోనూసూద్ కరోన వేళ ఎంతో మందికి సహాయం చేస్తూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.

వలస కూలీలను సొంత ఊళ్లకు చేర వేసే క్రమంలో బస్సుల్లో అందరిని తమ తమ ఊళ్లకు చేర్చి అభాగ్యుల పాలిట దైవ్యంగా మారారు. ఇక టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా ఎంతో మంది కరోనా బాధితులకు ఆక్సిజన్ బ్యాంకులను అందిస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారు.

ఇక వీరి లీస్టులో చేరిపోయారు ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి. తన వంతు సాయంగా తమిళనాడు ప్రభుత్వ నిధికి రూ.25 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. దీంతో సినీ అభిమానులు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు

 

Share.

Comments are closed.

%d bloggers like this: