థియేటర్లలో మళ్లీ వకీల్‌సాబ్ మూవీ?

Google+ Pinterest LinkedIn Tumblr +

పవన్ కళ్యాణ్‌ హీరోగా వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం వకీల్‌సాబ్. ఈ మూవీని నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 9న సినిమా థియేటర్లలో విడుద‌లై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కరోనా సెకండ్ వేవ్ కొనసాగడంతో కేసులు విపరీతంగా పెరిగాయి.

దీంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించడంతో సినిమా థియేటర్లు కూడా మూతపడ్డాయి. ఇక ఈ సినిమాను ప్రేక్షకులు చాల మంది చూడలేకపోయారు. ఇదిలా ఉండగా కరోనా సెకండ్ వేవ్‌లో కేసులు కాస్త తగ్గుముఖం పడుతుండడంతో థియేటర్లు మళ్లీ తిరిచే అవకాశాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు వకీల్ సాబ్ ను తిరిగి థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. దీనిపై దిల్ రాజ్ మాత్రం స్పందించలేదు. ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.

Share.

Comments are closed.

%d bloggers like this: