రూటు మార్చిన రవితేజ?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్‌లో పరిశ్రమలో రవితేజ రూటే సపరేటు అని చెప్పాలి. తన స్వయం కృషితో సినిమాల్లో అడుగుపెట్టి తన కంటూ ఓ గ్రాఫ్‌ను క్రియేట్ చేసుకున్నాడు రవితేజ. ఇక వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా మారాడు ఈ హీరో. ఈ ఏడాది క్రాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి మెప్పించి అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు .

తాజాగా రవితేజ గురుంచి ఫిల్మ్‌నగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఎప్పుడు పోలీస్ పాత్రలకే పరిమితమవుతున్న రవితేజ ఈ సారి ఏకంగా పవర్‌పుల్ గవర్నమెంట్ అధికారి పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. శ‌ర‌త్ మండ‌వ‌ అనే కొత్త దర్శకుడితో ఈ సినిమాను చేస్తున్నడట. ప్రస్తుతం ఖిలాడీ చిత్రంతో బిజీగా ఉన్నాడు రవితేజ.

 

Share.

Comments are closed.

%d bloggers like this: