అయోమయంలో ఉప్పెన డైరెక్టర్

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్‌లో ఉప్పెన చిత్రంతో దర్శకుడిగా మారాడు సాన బుచ్చిబాబు. ఈ మూవీతో తెలుగు పరిశ్రమలో ఆయన పేరు అప్పట్లో మారుమోగిపోయింది. ఈ సినిమా అనంతరం బుచ్చిబాబు ఎవరితో సినిమా చేస్తాడని ఫిల్మ్ నగర్ లో చర్చ జోరుగా సాగుతోంది.

ఉప్పెన చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు ఈ సారి బడా హీరోతో సినిమా చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాడట. అయితే టాలీవుడ్ అగ్ర హీరోలైన ఎన్టీఆర్, బన్నీ వంటి స్టార్ హీరోలతో మూవీ చేయాలనుకున్న ఆశలు మాత్రం ఆవిరయ్యాయట. ఇక వీరిద్దరితో సినిమా చేయటానికి చర్చలు సైతం జరిపిన బుచ్చిబాబు.వారి డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆయనకు నో చెప్పారని తెలుస్తోంది. దీంతో ఆయన ఏం చేయలేని అయోమయ పరిస్థితుల్లో ఉన్నట్లు సమాచారం. ఇక వారితో కాకుండా ఇంకేదైన హీరోతో చేస్తాడా లేక కొత్త హీరోతో చేస్తాడా అన్నది తేలాల్సి ఉంది.

Share.

Comments are closed.

%d bloggers like this: