పంజాబ్ సీఎంకు నిరసన సెగ

Google+ Pinterest LinkedIn Tumblr +

పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ కు భారీ నిరసన సెగ తగిలింది. మంగళవారం ఆయన ఇంటి వద్దకు చేరుకున్న శిరోమణి అకాలీదళ్ కార్యకర్తలు భారీ ఎత్తున నిరసనకు దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. శివాన్ లో జరిగిన ఈ ప్రొటెస్ట్ లో వందలాది నేతలు, కార్యకర్తలు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు.

ప్రభుత్వంలో అవినీతి జరుతుందంటూ అగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్, ఎస్సీల స్కాలర్ షిప్ లు, రైతుల భూములను కబ్జా వంటి అంశాల్లో అవినీతి జరిగిందంటూ ఆ పార్టీ కార్యకర్తలు అరోపించారు. మెడికల్ కిట్ల పంపకంలో, వ్యాక్సినేషన్ భారీగా అవినీతికి పాల్పడ్డారని వెంటనే ఆరోగ్యశాఖమంత్రి బల్ బీర్ సింగ్ సిద్దును బర్తరఫ్ చేయాలనీ డిమాండ్ చేశారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: