రేపు నల్లగొండ జిల్లాకు వైఎస్ షర్మిల

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న వైఎస్ షర్మిల రేపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె తెలుసుకోనున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక, ఆత్మహత్యకు యత్నించిన నీలకంఠ సాయిని, అతని కుటుంబాన్ని పరామర్శించనున్నారు వైఎస్ షర్మిల.

దీంతో పాటు కోదాడలోని దొండపాడులో వైఎస్ఆర్ అనుచరుడు, కుటుంబ సన్నిహితులు గున్నం నాగిరెడ్డి కుటుంబాన్ని సైతం వైఎస్‌ షర్మిల పరామర్శించనున్నారు. అనంతరం తిరిగి ఆమె హైదరాబాద్ కు చేరుకున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: