కల్నల్‌ సంతోష్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

Google+ Pinterest LinkedIn Tumblr +

చైనా సరిహద్దుల్లో గాల్వాన్‌ ఘర్షణల్లో ఎదురొడ్డి నిలిచి అమరుడైన కల్నల్‌ సంతోష్‌బాబు త్యాగానికి నేటికి సరిగ్గా ఏడాది పూర్తైంది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆయన కాంస్య విగ్రహాన్ని ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్.

అనంతరం సంతోష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రి. చైనా సైనికుల్నితరిమికొట్టే క్రమంలో ఆయన పోరాటం మరవలేనిదని అన్నారు కేటీఆర్. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని యువత రాజకీయాల్లోకి రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. సీఎం హామీ మేరకు రూ.20లక్షల వ్యయంతో 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: