రుతుపవనాల రాక…రానున్న రెండు రోజుల్లో వర్షాలు

Google+ Pinterest LinkedIn Tumblr +

నైరుతి రుతుపవనాల రాకతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రుతుపవనాల ప్రభావంతో రానున్న రెండు మూడు రోజుల్లో మోస్తారు నుంచి తెలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ కేంద్రం.

ఇక రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం పడొచ్చని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరం దాటి ఝార్ఖండ్‌పైకి చేరుకోవడంతో తెలంగాణ వైపునకు తిరిగి ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా మంగళవారం, బుదవారం కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

Share.

Comments are closed.

%d bloggers like this: