ఏపీలో వచ్చే నెలలో ఇంటర్, టెన్త్ పరీక్షలు-మంత్రి

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీలో కరోనా కేసుల ప్రభావాన్ని తగ్గేంచేందుకు వైసీపీ ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది. కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో విద్యాశాఖ ఇంటర్, టెన్త్ పరీక్షలను నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేస్తోంది. ఈ అంశంపై తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఓ ప్రకటన చేశారు.

వచ్చే నెల మొదటి వారంలో ఇంటర్, జూలై చివరి వారంలో టెన్త్ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్. విద్యార్థుల ప్రయోజనం కొరకే పరీక్షల నిర్వహణ అని అన్నారు. ఇక ఇంటర్ పరీక్షలకు 10 లక్షలకు పైగా విద్యార్థులు హాజరవుతారని తెలిపారు మంత్రి. దీంతో పాటు 1998 నాటి డీఎస్సీ అభ్యర్ధుల సమస్యపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని, 36 మందికి ఉద్యోగాలు సైతం కల్పిస్తామన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: