హుజురాబాద్ లో మొదలైన వర్గ పోరు

Google+ Pinterest LinkedIn Tumblr +

హుజురాబాద్ లో అసలు ఏం జరుగుంది.? ఇదే అంశంపై ఇప్పుడు స్థానిక ప్రజలు ఒకరికొకరు చర్చించుకుంటున్నారట. స్థానిక బీజేపీ నేత అయిన పెద్ది రెడ్డి గత కొంత కాలం నుంచి పార్టీ నేతలపై అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈటల రాజేందర్ బీజేపీలోకి చేరుతున్నార్న వార్తలు తెరపైకి వస్తున్న తరుణంలోనే ఆయన కొత్త రాగాన్ని ఎత్తుకున్నారు. ఇటీవల.. నా నిర్ణయం లేకుండా ఈటలను పార్టీలోకి ఎలా చేర్చుకుంటారని బహిరంగంగానే పెదవి విప్పారు పెద్దిరెడ్డి. ఈ నేపథ్యంలోనే ఆయన నేడు తన అనుచరులతో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో పెద్దిరెడ్డి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఇవాళ హుజూరాబాద్‌లో కార్యర్తలు, అనుచరులు, సన్నిహితులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచారణ ప్రకటించనున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: