శ్రీనువైట్ల డైరెక్షన్ లో జాతిరత్నాలు హీరోయిన్?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవల విడుదలైన మూవీ జాతిరత్నాలు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ ఫుల్ లెన్త్ కామెడీ సినిమా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అప్పట్లో ఈ చిత్రం అల్లరి అంతా ఇంతా కాదు. ఇక ఇందులో నటించిన నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్ధుల్లా వంటి నటులు వాళ్ల నటన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

ఇందులో చిట్టి అనే పాత్రలో నటించి మెప్పించిన హీరోయిన్ ఫరియా అబ్ధుల్లా. ఈ చిత్రం మంచి టాక్ తో దూసుకెళ్లడంతో హీరోయిన్ ఫరియా అబ్ధుల్లాకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అంది వచ్చిన అవకాశాలను ఒడిసి పట్టుకోకుండా మంచి పాత్రల కోసం వెయిట్ చేస్తుందట ఈ హీరోయిన్. శ్రీనువైట్ల డైరెక్షన్ లో మంచు విష్ణు హీరోగా ఢీ సీక్వెల్ గా రాబోతుంది. ఇక ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా ఎంపికైనట్లు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వారి పిలుపు మేరకు నటించేందుకు ఈ భామ సిద్దమైనట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Share.

Comments are closed.

%d bloggers like this: