సైకో కిల్లర్‌గా అందాల రాశి

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు చిత్ర పరిశ్రమలో రాశిఖన్నా తన అందంతో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. టాలీవుడ్ లో ఇప్పుడు పెద్దగా హిట్ లేని ఈ అమ్మడు మంచి హిట్ కోసం ఎదురుచూస్తుంది. తెలుగు చిత్ర సీమలో ఊహలు గుసగుసలాడే సినిమాతో తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అప్పుడప్పుడు స్టార్ హీరోలతో నటించి కొన్ని హిట్‌లను సైతం అందుకుందీ భామ.

దీంతో ఆగకుండా వెబ్ సిరీస్‌ల్లో కూడా నటిస్తుందీ అందాల రాశి. బాలీవుడ్‌ హీరో షాహిద్ కపూర్ జంటగా చేస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. ఇక అజయ్ దేవగణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న మరో వెబ్ సిరీస్‌లో నటించేందుకు రాశిఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్‌కు రాజేశ్ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో రాశిఖన్నా సైకో కిల్లర్ పాత్రలో నటిస్తున్నట్లు టాక్.

Share.

Comments are closed.

%d bloggers like this: