సిరిసిల్లలో డబుల్‌బెడ్ రూం ఇళ్లను ప్రారంభించిన కేటీఆర్

Google+ Pinterest LinkedIn Tumblr +

సిరిసిల్లలో పర్యటించారు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. రాచర్ల బొప్పాపూర్‌లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..పైసా ఖర్చు లేకుండా ఇళ్లు నిర్మిస్తున్నామని, మాది పేదల ప్రభుత్వమని అన్నారు కేటీఆర్. మా ప్రభుత్వంలో అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు.

పేదల ఆత్మగౌరం కోసమే ఇళ్లు కడుతున్నామని, గతంలో పిట్టగుళ్లల్లా కట్టారని కేటీఆర్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో రోడ్డు-భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్ కుమార్, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: