ప్రధానికి ఎంపీ రఘురామ లేఖ

Google+ Pinterest LinkedIn Tumblr +

నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వరుసగా లేఖలు రాస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ప్రధాని నరేంద్రమోడీకి కూడా తాజాగా లేఖ రాశారు ఎంపీ. ఏపీ ప్రభుత్వం అవపరాలకు మించిన అప్పులు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు రఘురామ.

ప్రభుత్వ ఆస్తులను ఏపీఎస్‌డీసీకి బదిలీ చేసి మరి రుణాలు సేకరిస్తోందని, ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి మరి అప్పులు తెస్తోందని తెలిపారు. దీంతో పాటు ఉచిత పథకాలకు మరో రూ. 3 వేల కోట్ల రుణం తెచ్చేందుకు బ్యాంకుల నుంచి సంప్రదింపులు చేస్తున్నారని లేఖలో తెలిపారు ఎంపీ రఘురామ. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలన్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: