తిరిగి మొదలవనున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా పవర్ స్టార్ రాంచరణ్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు సంబంధించిన చిత్ర షూటింగ్ దాదాపు పూర్తై చివరి ఘట్టానికి చేరుకుంది. అయితే కరోనా కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిగా పడింది. ఇక కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పడుతుండడంతో తిరిగి షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నాడట జక్కన.

ఇక ఈ మూవీ షూటింగ్‌ను వచ్చే నెలలో మొదలు పెట్టేందుకు రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ చివరి షెడ్యూల్డ్‌లో మాత్రం కరోనా వైరస్ కారణంగా తక్కువ మంది ఉండేందుకు చూస్తున్నారట రాజమౌళి. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ రెండు పాటలు, కొన్ని ఫైట్‌ సీన్ల మినహా అంతా జరిగిపోయిందట. అయితే వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభిస్తుండడంతో యూనిట్ సభ్యులందరికీ సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అలీయ భట్ సీత పాత్రలో నటిస్తుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: