లాక్‌డౌన్, కర్ప్యూతో మంచి ఫలితాలు-సీఎం జగన్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కరోనాపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కోవిడ్, కర్ఫ్యూ వంటి అంశాలపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు సీఎం. ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా విధించిన లాక్‌డైన్, కర్ప్యూ వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు సీఎం జగన్.

ఇక కరోనా ఎప్పటికీ అయిపోతుందని అనుకోవద్దని, ఎప్పుడు మాస్కులు, షానిటైజర్లు వాడుతూ ఉండాలని సూచించారు. ఇక గ్రామాల్లో ఫీవర్ సర్వే నిర్వహించాలని, కరోనా లక్షణాలు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఇక ఈ నెల 20 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని, ఆ తర్వాత కొన్ని సడలింపులతో కూడిన కర్ఫ్యూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: