ఏపీ గ్రూప్-1 ఇంటర్వ్యూలపై హైకోర్టు స్టే

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ గ్రూప్-1 ఇంటర్వ్యూలపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. రెండు వారాల పాటు ఎటువంటి ఇంటర్వ్యూలు నిర్వహించవద్దంటూ స్టే విధించింది ఏపీ హైకోర్టు. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని గతంలో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.

అయితే నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించలేదని, డిజిటల్ వాల్యూయేషన్ గురించి చివర్లో చెప్పారని పిటిషన్ తరుపు న్యాయవాది అన్నారు. ఇక వాల్యూయేషన్ గురుంచి ముందుగా చెప్పాల్సిన పనిలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. దీంతో ఇరువుని వాదనలు విన్న న్యాయస్థానం స్టే విధించింది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: