అవకాశం ఇస్తే పోటీకి దిగుతా-పెద్దిరెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలోకి చేరుతున్నారన్న వార్తలు ఊపందుకున్న తరుణం నుంచే తెలంగాణ బీజేపీ అగ్రనేతలపై గుర్రుగా ఉన్నారు హుజురాబాద్ స్థానిక బీజేపీ నేత పెద్దిరెడ్డి. నేడు హుజురాబాద్ వెళ్లిన ఆయన తన అనుచరులతో భేటీ అయ్యారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన పెద్దిరెడ్డి కొన్నిఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. భారతీయ జనతా పార్టీలోకి ఎవరొచ్చినా చేర్చుకుంటామని, చివరికి సీఎం కేసీఆర్ వచ్చినా స్వాగతిస్తామని తెలిపారు. ఇక హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తనకు అవకాశం ఇస్తే పోటీ చేస్తానని వ్యాఖ్యానించారు. తాజాగా ఈటల రాజేందర్ రాజీనామా చేయటంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: