ఈటలపై మండిపడ్డ కడియం

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై మండిపడ్డారు ఉప ముఖ్యమంత్రి కడియ శ్రీహరి. తాను వామపక్ష భావాలు కలిగిన వాడినని, సోషలిస్టునని చెప్పుకునే ఈటల బీజేపీలో ఎందుకు చేరారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. హన్మకొండలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. మామూలు నాయకులు చేరితేనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు.. కానీ ఈటల వెళ్తే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పంపారని పేర్కొన్నారు కడియం. ఇక ఈటల బీజేపీలోకి ఆస్తులను రక్షించుకోవడానికే వెళ్లారని అన్నారు. టీఆర్ఎస్‌కు ఇంకా 20 ఏళ్ల వరకు తిరుగులేదని, కేసీఆర్ తెలంగాణకు ఏకైక బహుబలి అని అన్నారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: