మాకు బయపడే ఇలా చేశారు-వైఎస్ షర్మిల

Google+ Pinterest LinkedIn Tumblr +

వైఎస్ షర్మిల నిన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఉద్యోగ నోటీఫికేషన్లు రాక నీలకంఠం సాయి అనే యువకుడు ఇటీవల ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన షర్మిలకు షాక్ తగిలింది.

ఆ యువకుడి ఇంటికి వెళ్లే సరికి తాళం ఉండడంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో స్పందించిన షర్మిల.. స్థానిక టీఆర్ఎస్ నేతలు మాకు బయపడే ఆ యువకుడిని ఎక్కడికో తరలించారని అన్నారు. ఇక ఆ యువకుడిని బెదిరించి ఉద్యోగం కల్పిస్తామని టీఆర్ఎస్ నేతలు చెప్పారని, ఇది మా తొలి విజయంగా భావిస్తున్నామని తెలిపారు షర్మిల. ఉద్యమ సమయంలో 1200 మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారని, వారి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత ఆ ఊసే మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: