ఎంపీ రఘురామ సీఎం జగన్ కు లేఖ

Google+ Pinterest LinkedIn Tumblr +

నర్సాపురం ఎంపీ రఘురామరాజు సీఎం జగన్మోహన్ రెడ్డికి మరో లేఖ రాశారు. ప్రతి రోజు లేఖలు రాస్తూ రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతున్నారు. ఏపీలో వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీలు – పేదలందరికి ఇల్లు పథకం అనే హామీని సీఎం జగన్ మరిచిపోతున్నారని, ఆ మాటను నిలబెట్టుకోవాలన్నారు.

దీంతో పాటు ఇళ్ల నిర్మాణం కోసం రూ. 25 లక్షల ఇళ్లు ఇస్తా అని పాలకొల్లులో చెప్పారని గుర్తు చేశారు.
గత సంవత్సరం జూన్ 16న గృహనిర్మాణ పథకానికి రూ. 3,691.79 కోట్లు మంజూరు చేసి.. 2021 లో ఓటు-ఆన్ అకౌంట్ ఆర్డినెన్స్‌లో బడ్జెట్ కేటాయింపులను ఇచ్చిందని తెలిపారు. 17వేల హౌసింగ్‌ కాలనీలు నిర్మించడానికి 50వేల కోట్లకు పైగా అవసరం ఉంటాయని తెలిసినప్పుడు బడ్జెట్‌ కేటాయింపులు తక్కువగా ఎలా చేస్తున్నారో అర్ధం కావడం లేదని లేఖలో తెలిపారు రఘురామ.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: