పంజాబీకి చెక్కేస్తున్న పాయల్

Google+ Pinterest LinkedIn Tumblr +

పాయల్ రాజుపుత్..ఆర్ఎక్స్100 సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టింది ఈ హీరోయిన్. ఈ మూవీతో పాయల్ పేరు టాలీవుడ్ లో మారు మోగి పోయింది. ఈ చిత్రం నుంచి ఈ భామకు ఆఫర్లు సైతం క్యూ కట్టాయి. దీంతో వెంకీమామ, డిస్కోరాజా వంటి సినిమాలు చేసినా అనుకున్న విజయం సాధించలేకపోవడంతో కాస్త నిరాశ పడింది.

ఇక ఏం చేయాలో తెలియక ఈ మధ్య కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటించింది. దీంతో మంచి ఆఫర్లు రావడం లేదంట. దీంతో పంజాబీకి సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇంతకు పంజాబీలోనైన పాయల్ హిట్ కొడుతుందో లేదో చూడాలి మరి.

 

Share.

Comments are closed.

%d bloggers like this: