కర్నూలులో టీడీపీ నేతల హత్య

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీలో వరుస హత్యలు సంచలనంగా మారుతున్నాయి. బుధవారం కడపలో కాల్పుల కలకలం మరువకముందే కర్నూలు జిల్లాలో మరో హత్య చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో ఇద్దరు అన్నదమ్ములను ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి చంపేశారు.

మృతులు మాజీ సర్పంచ్ ఒడ్డు నాగేశ్వర రెడ్డి, అతని తమ్ముడు, వ్యవసాయ సహకార సంఘం సొసైటీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డిగా గుర్తించారు. ఇక ఈ హత్యను వైసీపీ నేతల పనేనని కొందరు బంధువులు ఆరోపిస్తున్నారు. పాత కక్షల కారణంగానే వీరి హత్య జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఇక పట్టపగలే హత్య జరగడంతో గ్రామస్థులు భయంతో వనికిపోతున్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: