ఇక ఎగిరేది కాషాయ జెండానే-ఈటల

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ అక్రమాల నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి ఆయనను భర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈటల తాజాగా బీజేపీలో చేరారు. ఇక కమలం పార్టీలో చేరిన తర్వాత మొదటి సారిగా ఆయన హుజురాబాద్‌కు వెళ్లారు.

దీంతో బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి మీడియా సమావేశంలో మాట్లాడారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, మైనారిటీలు వెనుకుబాటకు గురయ్యారని, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు. ఇక హుజురాబాద్ లో కాషాయ జెండా ఎగరవేస్తామని తెలిపారు ఈటల.

Share.

Comments are closed.

%d bloggers like this: