ఆయనతో పని చేసేందుకు ఎదురు చూస్తున్న-ధనుష్

Google+ Pinterest LinkedIn Tumblr +

డైరెక్టర్ శేఖర్ కమ్ములతో సినిమా చేసేందుకు టాలీవుడ్ హీరోలందరూ రెడీగా ఉంటారు. ఆయన తెరకెక్కించిన హ్యపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఫిదా వంటి విభిన్న సినిమాలు తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల దిట్ట అనే చెప్పాలి. దీంతో ఆయన డెరెక్షన్ లో సినిమా చేసేందుకు స్టార్ హీరోలందరూ సిద్దంగా ఉంటారు. ఇదే దారిలోకి వచ్చాడు తమిళ స్టార్ హీరో ధనుష్.

శేఖర్ కమ్ములతో సినిమా చేసే అంశంపై ట్విట్ చేశాడు ధనుష్. శేఖర్ కమ్ముల తాను ఇష్టపడే దర్శకుల్లో ఒకరని, ఆయనతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా అంటూ ట్విట్ చేశాడు. నారాయణదాస్ నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మాణంలో ఎస్వీసీ ఎల్ఎల్పీ సంస్థలో నటిచడం సంతోషంగా ఉందన్నారు. సినిమా ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నా అని పేర్కొన్నారు.

దర్శకుడు శేఖర్ కమ్ముల, ధనుష్ తెలుగు తమిళ హిందీ త్రిభాషా చిత్రాన్ని శుక్రవారం అనౌన్స్ చేశారు. ఈ సినిమా ధనుష్ కు తొలి స్ట్రైట్ తెలుగు సినిమా కానుంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక శేఖర్ కమ్ముల అక్కినేని నాగచైతన్య సాయిపల్లవి జంటగా రాబోతున్న లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

Share.

Comments are closed.

%d bloggers like this: