ధనుష్ కు జోడీగా సాయిపల్లవి?

Google+ Pinterest LinkedIn Tumblr +

తమిళ స్టార్ హీరో ధనుష్. శేఖర్ కమ్ములతో సినిమా చేసే అంశంపై తాజాగా ట్విట్ చేశాడు. శేఖర్ కమ్ముల తాను ఇష్టపడే దర్శకుల్లో ఒకరని, ఆయనతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా అంటూ ట్విట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే శేఖర్ కమ్ములతో సినిమా చేస్తుండడంత ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

ఇక ఇందులో హీరోయిన్ గురించి తాజాగా కొన్ని వార్తలు ఊపందుకున్నాయి. కాగా ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవిని ఎంపిక చేసుకుంటున్నారని తెలుస్తోంది. గతంలో ధనుష్‌తోను ‘మారి 2’లో జతకట్టింది సాయిపల్లవి. దీంతో ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుంది అంటూ ఫిల్మ్ నగర్ లో చర్చ జోరుగా సాగుతోంది.

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో సాయిపల్లవి మళ్లీ నటిస్తే గనుక ఇది మూడో సినిమా కానుంది. గతంలో ఫిదా సినిమాలో నటించగా నాగ చైతన్యతో నటిస్తున్న లవ్ స్టోరీ మూవీ విడుదలకు సిద్దమవుతోంది. ఇందులో కనుక సాయిపల్లవి నటిస్తే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయి. మరి ఇంతకు ఈ వార్తలో నిజం ఎంతుందో చూడాలి మరి.

 

Share.

Comments are closed.

%d bloggers like this: