విజయ్ దేవరకొండతో జెర్సీ డైరెక్టర్?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాలతో అంతగా మెప్పించక పోయినా తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రంతో స్టార్ హీరో రేంజ్ ను అందుకున్నాడు విజయ్. చిన్న సినిమాగా విడుదలై పెద్ద మూవీల రికార్డును బ్రేక్ చేసింది అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో హీరో రేంజ్ పెరిగి స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. దీంతో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు ఈ హీరో.

తాజాగా జెర్సీ డైరెక్టర్ గౌతం తిన్ననూరి ఓ స్టోరీ చెప్పడంతో దానిని ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గౌతం తన్ననూరి మొదటగా ఈ కథను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి వినిపించాడట, ఆయనకు నచ్చకపోవడంతో అదే స్టోరీని మళ్లీ మార్పులు చేసి విజయ్ కి వినిపించాడట గౌతం. దీంతో ఈ లైన్ విజయ్ దేవరకొండకు నచ్చడంతో ఈ సినిమాను ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: