డీఎస్సీ గురించి స్పష్టతనివ్వాలి-నాదేండ్ల

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్. ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2ల్లో భర్తీ చేసేది కేవలం 36 పోస్టులా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. డీఎస్సీ గురించి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

శాఖల వారీగా ఉన్న ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలిపారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఏపీపీఎస్సీ ద్వారా 2లక్షల 30వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన జగన్, అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత మాట మార్చి మడమ తిప్పిందని మండిపడ్డారు. లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని మేనిఫెస్టోలో చెప్పిన వైసీపీ.. చివరికి ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2ల్లో కేవలం 36 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని చూపించిందని విమర్శలు గుప్పించారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: