హుజరాబాద్ ఉప ఎన్నిక భరిలో ఈటల జమున?

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే పార్టీలన్నీ ఇప్పటి నుంచే తెర వెనక రాజకీయాలు మొదలుపెడుతున్నాయి.

స్థానిక బీజేపీ నేత అయిన పెద్దిరెడ్డి ఈటల రాకను జీర్ణించుకోలేక సతమతమవుతున్నారు. తనకు పార్టీ అధిష్టానం ఎక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా పోతుందో అని భయంతో పెద్దిరెడ్డి ఉన్నట్లు సమాచారం. ఇక హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి ఈటల భార్య జమునను రంగంలోకి దింపేందుకు పార్టీ అధిష్టానం సిద్దంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈటలకు మాత్రం కేంద్రమంత్రి ఇవ్వనున్నారని తెలుస్తోంది. మరి ఇది కనుక నిజమైతే ఈటల రాజకీయంగా బలపడనున్నాడని ఖాయంగా కనిపిస్తోంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: