కేంద్రమంత్రిగా ఈటల రాజేందర్?

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కి కేంద్రమంత్రి పదవి దక్కనుందా? ఇప్పుడు ఇదే వార్త తెలుగు రాజకీయల్లో జోరుగా సాగుతుంది. ఇటీవల పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఈటల రాజేందర్. దీంతో కాషాయ గూటికి చేరడంతో కేంద్ర అధిష్ఠానం ఆయనకు కేంద్రమంత్రి పదవిని ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ఇక రానున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి అభ్యర్థిగా ఆయన భార్య జమునను దింపి ఆయనను కేంద్ర రాజకీయాల్లోకి పంపే దిశగా బీజేపీ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ దిశగా ఈటల రాజేందర్ అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. ఈటల బీజేపీలో చేరడం కన్నా ముందే ఢిల్లీ నేతలను పలు మార్లు కలిసి ఇదే విషయంపై మంతనాలు జరిపినట్లు మీడియా కోడై కూస్తోంది. మరి ఆయన కేంద్రమంత్రి ఆశలపై నీళ్లు జల్లుతారా లేక అవకాశం కల్పిస్తారా అని ఈటల వర్గం నేతలు అనుకుంటున్నారట. ఇదే కనుక నిజమైతే ఈటల రాజకీయంగా ఓ మెట్టు ఎక్కనున్నారని తేటతెల్లమవుతోంది.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: