చిరు ఈ లుక్ లూసిఫర్ కోసమేనా?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టోరీని ఆధారంగా చేసుకుని హీరోల పాత్రలు, వారి లుక్స్ డిజైన్ చేస్తారు దర్శకులు. పాత్ర డిమాండ్ చేస్తే దానికి తగ్గట్టు లుక్స్ మార్చుకుంటున్నారు మన హీరోలు. ఇక వారి పాత్రలకు తగ్గట్టుగా నడుచుకుని షూటింగ్ కన్నా ముందే వారి లుక్స్ ని మార్చే పనిలో ఉంటారు.

తాజాగా అదే వార్తలో నిజమే అన్నట్లు మనకు దర్శనమిచ్చారు మెగాస్టార్ చిరంజీవి. కాంగ్రెస్‌ నేత రఘువీరారెడ్డి తన స్వగ్రామంలో శిథిలావస్థకు చేరిన కొన్ని దేవాలయాలను పునర్నిర్మించి, మరికొన్నింటిని నూతనంగా నిర్మించారు. ఆ ఆలయాల ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా చిరంజీవి రఘువీరారెడ్డికి అభినందనలు చెప్తూ ఒక వీడియో పంచుకున్నారు.

ఇందులో పూర్తిగా లుక్స్ మార్చేసి తెల్లని గడ్డంతో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఇది పక్కా తాను చేయబోయే లూసిఫర్ మూవీలో ఇదే లుక్స్ లో చిరు కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్‌’ సినిమాని రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిరు కొరటాల దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాలో నటించారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

Share.

Comments are closed.

%d bloggers like this: