తెరపై పడనున్న బొమ్మ

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించటంతో థియేటర్లు అన్ని మూతపడ్డాయి. దీని కారణంగా సినిమాల విడుదలకు బ్రేక్ పడింది. దీంతో సినిమా షూటింగ్స్ కూడా వాయిదా వేసుకున్నారు దర్శక, నిర్మాతలు. ఇక సెకండ్ వేవ్ కూడా కాస్త తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు జనాలు.

దీంతో శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ అయ్యింది రాష్ట్ర కేబినెట్. ఈ భేటీలో కరోనా కేసులు సంఖ్య తగ్గటంతో లాక్ డౌన్ ఎత్తివేతకు నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. ఇక నేటి నుంచి అన్ని కార్యకలాపాలు యాధావిథిగా కొనసాగనున్నాయి. లాక్ డౌన్ తో మూత పడ్డ సినిమా థియేటర్లు కూడా నేటి నుంచి తెరిచేందుకు సిద్దమవుతున్నారు థియేటర్ల యజమానులు. ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో మూవీ థియేటర్లు నేటి నుంచి తేరుచుకోనున్నాయి. దీంతో కరోనా కారణంగా వాయిదా పడ్డ సినిమాలన్నీ థియేటర్లలో విడుదల చేయనున్నారు దర్శక, నిర్మతలు.

Share.

Comments are closed.

%d bloggers like this: