థియేటర్లలో పాగల్ మూవీ

Google+ Pinterest LinkedIn Tumblr +

లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ థియేటర్లు నేటి నుంచి తెరచుకోనున్నాయి. దీంతో సినిమా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టనున్నారు. కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తేసింది. ఇక విషయానికొస్తే తెలుగు సినిమా పరిశ్రమలో యువ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విష్వక్సేన్.

గతంలో హిట్ చిత్రం విజయం సాధించడంతో పాగల్ సినిమాతో మళ్లీ రెడీ అయ్యాడు ఈ యువ హీరో. గతంలో థియేటర్లు మూతపడటంతో ఓటీటీ ద్వారా పాగల్ విడుదల చేద్దామనుకున్న కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. ఇక థియేటర్లు సైతం తెరుచుకోవడంతో మూవీ రిలీజ్ కు సిద్దమవుతున్నారు దర్శక, నిర్మాతలు. విష్వక్ సేన్ సరసన సిమ్రన్ చౌదరి, నివేదా పేతురాజ్ నటించనుండగా నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: