టాలీవుడ్ బడా డైరెక్టర్ తో సూర్య?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇటీవల ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంతో భారీ హిట్ అందుకొని మళ్లీ ఫాంలోకి వచ్చారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. తనదైన నటనతో కోలీవుడ్ ప్రేక్షకులను మెప్పిస్తుంటాడు ఈ హీరో. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు సూర్య. సందేశాత్మక చిత్రాలు చేస్తూ నటన పరంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.

తాజాగా ఈయన గురించి టాలీవుడ్ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో ఓ రేంజ్ సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, బోయపాటి శ్రీను. వీరిద్దరితో సినిమా అంటే స్టార్ హీరోలందరూ క్యూ కట్టాల్సిందే. అలాంటి డైరెక్టర్లతో తమిళ హీరో సూర్య ఓ సినిమా చేయనున్నాడని వార్తలు దూసుకొస్తున్నాయి.

ఇక తెలుగులో స్ట్రేట్ మూవీ చేయనున్న సూర్య ఈ ఇద్దరిలో ఎవరితో మొదటగా సినిమా చేస్తాడో అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ వార్తలో నిజం ఉందో లేదో కూడా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే.

 

Share.

Comments are closed.

%d bloggers like this: