సిద్దిపేటకు వరాలు కురిపించిన సీఎం

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణలో సీఎం కేసీఆర్ నేటి నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. నేడు సిద్దిపేటలో పర్యటించిన ఆయన పలు భవనాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్, పోలీసు కమిషనరేట్ ను ప్రారంభించారు సీఎం కేసీఆర్. అనంతరం ఆయన మాట్లాడుతూ..సిద్దిపేటకు వరాలు ప్రకటిస్తూ వెటర్నరీ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు .

సిద్దిపేటతో పాటుగా వరంగల్, నల్గొండ, నిజామాబాద్ లకు కూడా వెటర్నరీ కాలేజీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు సీఎం. ఇక తెలంగాణలో మిషన్ కాకతీయ వల్ల చెరువులన్నీ నిండిపోయాయని అన్నారు. అనంతరం ఆయన తిరిగి కామారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్లారు.

Share.

Comments are closed.

%d bloggers like this: