నోరు జారిన ఈటల

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరి ఆయన ఎపిసోడ్ కాస్త బ్రేక్ పడిందనే చెప్పాలి. ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఈటల. ఇక బీజేపీలో చేరిన నాటి నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో వరుసగా సమావేశమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈటల నోట నుంచి కొత్త మాట వచ్చింది. అంటే కొత్తమాట ఏం కాదనుకోండి. ఇన్ని సంవత్సరాల నుంచి పలికి పలికి అదే నోరు జారి వచ్చిందనే చెప్పాలి.

ఇక విషయానికొస్తే పార్టీ నేతల కార్యక్రమంలో మాట్టాడుతున్న ఆయన హుజరాబాద్ లో ఎగిరేది గులాబీ జెండా అని పొరపాటున అన్నారు. అంతలోనే గుర్తించి కాషాయ జెండా ఎగరబోతుంది అంటూ చెప్పుకొచ్చారు ఈటల. ఇక ప్రభుత్వ పథకాలు.. ప్రజల చెమట సొమ్మేనని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని తేల్చి చెప్పారు. తెలంగాణలో ఎలాంటి పాలన కొనసాగుతుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు ఈటల.

Share.

Comments are closed.

%d bloggers like this: