త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ?

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రధాని నరేంద్రమోడీ కేంద్ర మంత్రి విస్తరణకు తెరవెనకాల పనులు చక చక పూర్తి చేస్తున్నాడు. గత కొంత కాలం నుంచి త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుందనే వార్త దేశ రాజకీయాల్లో జోరుగా సాగుతుంది. నేడు కేంద్ర మంత్రులతో భేటీ నేపథ్యంలో ఇదే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.

నేటీ భేటీలో ప్రధానితో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, పియూష్ గోయల్ పాల్గొన్నారు. ఇక వచ్చే ఏడాదిలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్ననేపథ్యంలో ఆ రాష్ట్రాల వారికి మంత్రి వర్గంలో అవకాశం లభించనున్నట్లు సమాచారం. దీంతో పాటు బీజేపీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రాష్ట్రాలకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కనుందని తెలుస్తోంది.

 

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: