ఏపీ సీఎంకు రఘురామ మరో లేఖ

Google+ Pinterest LinkedIn Tumblr +

నర్సాపురం వైసీసీ రెబల్ ఎంపీ రఘురామ రాజు నేడు కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ప్రతీ రోజు ఏదో ఒక అంశాన్ని ఆధారంగా చేసుకుని సీఎంకు లేఖలు రాస్తున్నారు రఘురామ. వరుస లేఖలు రాస్తూ రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నారు.

ఇక నేటి లేఖ విషయానికొస్తే ఏకంగా ఈ సారి శాసనమండలిని రద్దు చేయాలంటూ లేఖలో పేర్కొన్నాడు. మెజార్టీ ఉన్న సమయంలో మండలిని రద్దు చేస్తే ప్రజల పట్ల ఆయనకున్న నమ్మకం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. గతంలో వైసీపీకి శాసనమండలిలో మెజార్టీ లేనప్పుడు రద్దు దిశగా తీర్మానం చేసినప్పుడు ఇప్పుడు కూడా రద్దు చేయాలని లేఖలో పేర్కొన్నాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: