యోగా దినోత్సవంలోప్రధాని కీలక వ్యాఖ్యలు

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడు 7వ అంతర్జాతీయ యోగా డే దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కరోన వేళ ప్రతీ ఒక్కరు యోగాను రక్షణ కవచంగా వాడుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా కారణంగా భారత్ సహా ప్రపంచ దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయన్నారు.

దేశంలో లక్షలాదిమంది యోగ సాధకులుగా మారారని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో రానున్న రోజుల్లో ఎం-యోగా అప్లికేషన్‌ను ప్రారంభిస్తామన్నారు. ఇందులో యోగా శిక్షణకు సంబంధించి పలు భాషల్లో వీడియోలు ఉంటాయన్నారు. దీనివల్ల ‘ఒకే దేశం-ఒకే ఆరోగ్యం’ లక్ష్యం సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ.

Share.

Comments are closed.

%d bloggers like this: