హైదరాబాద్‌లో పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు

Google+ Pinterest LinkedIn Tumblr +

హైదరాబాద్ వాసులకు మరో శుభవార్త అందింది. సంవత్సరానికి పైగా నిలిచిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లు మళ్లీ కూత పెట్టనున్నాయి. కరోన కాస్త తగ్గుముఖం పట్టడంతో కేంద్ర రైల్వే శాఖ ఎంఎంటీఎస్ రైళ్లను పట్టాలెక్కించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇక హైదరాబాద్ లో సాధారణ ప్రయాణికుడు తక్కువ ఖర్చుతో తన గమ్యాన్ని చేరుకోనున్నాడు.

ఇందులో భాగంగా బుధవారం నుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావటానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రస్తుతం 10 రైళ్లను మాత్రమే అందుబాటులోకి తెచ్చి కోవిడ్ తగ్గాక మరిన్ని రైళ్లను నడపనున్నామని తెలిపారు అధికారులు.

ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న రైళ్లలో మూడు ఫలక్‌నుమా నుంచి లింగంపల్లికి, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు మూడు, హైదరాబాద్ నుంచి లింగంపల్లికి రెండు, లింగంపల్లి నుంచి హైదరాబాద్‌కు రెండు రైళ్లు నడవనున్నాయి. ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వెళ్లే తొలి రైలు ఉదయం 7.50 గంటలకు బయలుదేరనుండగా, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే తొలి రైలు ఉదయం 9.20 గంటలకు బయలుదేరుతుంది. లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లే మొదటి రైలు ఉదయం 8.43 గంటలకు బయలుదేరనుండగా, హైదరాబాద్ నుంచి లింగంపల్లి వెళ్లే రైలు ఉదయం 9.36 గంటలకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: