ప్రదీప్‌పై ఏపీ ప‌రిర‌క్ష‌ణ స‌మితి అగ్రహం

Google+ Pinterest LinkedIn Tumblr +

బుల్లితెరపై ప్రదీప్ మాచి రాజు అల్లరితో సగటు ప్రేక్షకుడిని నవ్విస్తుంటాడు. మాములుగా ప్రతీ షోలో ప్రేక్షకుడిని నవ్వించేందుకు బుల్లితెర తారలు ఏదో ఒక కామెంట్‌తో నవ్వించేందుకు ప్రయత్నిస్తుంటారు. అలా చేసిన ప్రతీ కామెంట్‌కునవ్వుతో పాటు కొన్ని వివాదాలు కూడా వస్తుంటాయి.

తాజాగా హైపర్ ఆది తెలంగాణపై చేసిన కామెంట్స్ సద్దుమణిగేలోపే మరో వివాదం వచ్చి పడింది. నవ్వు అన్ని సమయాల్లో మంచిది కాదన్నట్టుగా తాజాగా ఓ కార్యక్రమంలో ఏపీ రాజధాని విషయం గురించి ప్రస్తావన వచ్చింది. దీంతో ఏపీ రాజ‌ధాని విశాఖ అని ప్ర‌దీప్ కామెంట్ చేయ‌డం వివాదానికి దారి తీసింది. వెంటనే స్పందించారు ఏపీ ప‌రిర‌క్ష‌ణ స‌మితి సభ్యులు. ఇక ప్రదీప్ క్షమాపణ చెప్పకుంటే హైదరాబాద్ లోని ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: