నేటి నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా కారణంగా నిలిచిపోయిన అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నేటి నుంచి తిరగనున్నాయి. కోవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో బస్సు సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రయాణికుల గమ్యం సాఫిగా సాగనుంది. తెలంగాణ సర్కార్ లాక్‌డౌన్ ఎత్తేయడంతో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది టీఎస్ఆర్టీసీ. ఇక కరోనా కారణంగా గత కొంత కాలం నుంచి నిలిచిపోయిన అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను కూడా నడిపించేందుకు అనుమతులు ఇచ్చింది తెలంగాణ సర్కార్.

గతంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో ఏం చేయని ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో పక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రయాణికులు ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు. ఇక నేటి నుంచి అంతర్రాష్ట్రాలకు బస్సు సర్వీసులు నడుస్తుండటంతో పొరుగు రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు అడ్డు తొలిగిపోయింది. రద్దీకి అనుగుణంగా రోజూ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఏపీకి బస్సు సర్వీసులు మొదలైనట్టు తెలిపారు అధికారులు

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: