తారల అందానికి కేరాఫ్ యోగా

Google+ Pinterest LinkedIn Tumblr +

చిత్రపరిశ్రమల్లో తారల అందాల వెనుక ఏదో రహస్యం ఉందనుకుంటారు సగటు ప్రేక్షకుడు. మూడు పదుల వయస్సు దాటిన చెక్కుచెదరని అందంతో యవ్వనంగా కనిపిస్తుంటారు మన టాలీవుడ్ అందాల తారలు. వారి అందం వెనుక దాగి ఉన్న తంత్రమేంటో వెతుకులాడే పనిలో ఉంటారు అభిమానులు. కానీ అందులో ఎలాంటి మంత్ర,తంత్రాలు ఉండవని కొన్ని సందర్భాల్లో చెబుతుంటారు హీరోయిన్స్.

ఇక వారి అందానికి యెగానే కేరాఫ్ అడ్రస్ అని చాలా ఇంటర్వ్యూలో చెబుతుంటారు ముద్దుగుమ్మలు. ఇక నేడు 7వ అంతర్జాతీయ యెగా దినోత్సవం కావటం విశేషం. యోగా అనేది శారీరక, మానసిక ఉల్లాసానికి సంబంధించింది.మన టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు యోగాతో నాజుకైన అందంతో వారి యవ్వనాన్నివలకబోస్తుంటారు. నిత్యం ఏదో షూటింగ్స్ లో బిజీగా ఉండే భామలు ఉదయం వారు చేసే యోగా విషయంలో మాత్రం అస్సలు వెనక్కితగ్గారనే చెప్పాలి.

మన టాలీవుడ్ లో ప్రముఖంగా ఇలీయానా, అనుష్క, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, ఆదాశర్మ, ఇషా రెబ్బా వంటి హీరోయిన్లు ఇప్పటికీ వారి అందంతో కుర్రకారుకు హుషారెక్కిస్తారు. వారి నాజుకైన సోగసుకి యోగాతో వన్నెతెస్తుంటారు టాలీవుడ్ భామలు. ప్రతీ రోజు ఉదయం లేవగానే గంట పాటు జిమ్, యోగా లాంటి ఎక్ససైజ్ లతో వారి అందానికి, యవ్వనానికి మరిన్ని మెరుగులు దిద్ది వారి సోగసులతో ఇప్పటికీ ఇవ్వనంగా కనిపించటం విశేషం. ఇదే వారి అందానికి సిక్రెట్ అని చెబుతారు.

Share.

Comments are closed.

%d bloggers like this: