ఎఫ్-3లో ప్రగ్యా స్పెషల్ సాంగ్?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎఫ్-2 సినిమా తెలుగు తెరపై సూపర్ హిట్ కామెడీ ఎంటర్ టైన్మెంట్ గా నిలిచి బంపర్ హిట్ ను అందుకుంది. ఇక దీనికి సీక్వెల్ గా ఎఫ్-3ని రూపొందిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. సగం వరకు పూర్తైన ఈ చిత్ర షూటింగ్ మిగతాది త్వరలో ప్రారంభించనున్నారు మూవీ యూనిట్.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. కాగా ఇందులో ఒక ఐటమ్ సాంగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం చిత్ర యూనిట్ ప్రగ్యా జైస్వాల్ ను ఎంపిక చేశారట. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Share.

Comments are closed.

%d bloggers like this: