అప్పుడు జాబ్ రెడ్డి..ఇప్పుడు డాబు రెడ్డి-లోకేష్

Google+ Pinterest LinkedIn Tumblr +

వైసీపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ టీడీపీ నేతలు పలు రకాలుగా విమర్శిస్తున్నారు. గతంలో కొందరు నేతలు పెదవి విప్పగా తాజాగా నారా లోకేష్ జాబ్ క్యాలెండర్ పై తనదైన శైలీలో విమర్శలు సందించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల ముందు జగన్ జాబ్ రెడ్డిగా ఉండి..ఇప్పుడు డాబు రెడ్డిగా మారరని విమర్శించారు. గ్రూప్-1 పరీక్ష రాసి ఇంటర్వ్యూ కోసం వేచి చూస్తున్న అభ్యర్ధులతో సమావేశం నిర్వహించారు లోకేష్. ఇక ఇటీవల గ్రూప్-1 ఇంటర్వ్యూలు నిలిపేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎంపిక ప్రక్రియ, వ్యాల్యుయేషన్ పై అనుమానాలున్న వారి సమస్యను పరిష్కరించేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు నారా లోకేష్.

 

Share.

Comments are closed.

%d bloggers like this: