పవార్ అధ్యక్షతన రేపు విపక్ష పార్టీల భేటీ

Google+ Pinterest LinkedIn Tumblr +

శరద్ పవార్ అధ్యక్షతన రేపు విపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. దేశంలోని 15 పార్టీలకు పవార్, యశ్వంత్ సిన్హా లేఖలు రాశారు. దేశంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీ జరగనుందని తెలుస్తోంది. బీజేపీ పార్టీని రానున్న ఎన్నికల్లో ఎదుర్కునేందుకు దేశంలోని అన్నిప్రతిపక్షాలను ఏకం చేసే దిశగా ఈ భేటీ జరగనుందని సమాచారం.

ఇటీవల ప్రశాంత్ కిషోర్ శరద్ పవార్ ను కలిసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సూచనలు, సలహాలు ఈ భేటీలో ఉండనున్నాయని స్పష్టమవుతోంది. వీరిద్దరి భేటీతో దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇక రేపు జరగబోయే ఈ భేటీ శరద్ పవార్ నివాసంలో సాయంత్రం 4 గంటలకు జరగనుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: