రఘురామ జగన్ కు మరో లేఖ

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రతీరోజు లేఖలు రాస్తూ రాజకీయంగా దూకుడు పెంచుతున్నారు రఘురామ. నేడు కూడా పేదల ఆహారం నేపథ్యంలో లేఖ రాశారు. గతంలో అన్నా క్యాంటీన్లు పేదల ఆకలి కోరత తీర్చే దిశగా గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రవేశపెట్టింది. ఇక వైసీపీ ప్రభుత్వం కూడా అలాంటి పథకాలు రూపొందించాలని లేఖలో పేర్కొన్నాడు.

రానున్న వైఎస్సార్ జయంతి కానుకగా జగనన్న క్యాంటీన్ లేదా వైఎస్సార్ క్యాంటిన్ ఈ రెండింటిలో ఏదో ఒకటి ప్రవేశపెట్టాలని సూచించారు. ప్రజల్లో మీకు మంచి పేరుందని, ఆ పేరును నిలబెట్టుకుని దైవదూతగా మారిపోండని తెలిపారు. ఇక పేదల ఆహారం అందించే దిశగా ఈ పథకాలను ప్రవేశపెట్టాలని లేఖలో తెలిపారు రఘురామ.

Share.

Comments are closed.

%d bloggers like this: