పంజాబ్ లో దూకుడు పెంచిన ఆప్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాస్త దూకుడు పెంచారనే చెప్పాలి. రానున్న పంజాబ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠంపైనే కన్నేశారు. ఈ మధ్య అమృత్‌సర్‌లో పర్యటించిన ఆయన తాము గనుక అధికారంలోకి వస్తే స్థానిక పంజాబీ వ్యక్తినే సీఎం చేస్తామంటూ తెలిపారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ రాజకీయాలు కాస్త వేడెక్కాయని చెప్పాలి.

ఇక్కడ అధికారమే లక్ష్యంగా తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నాడు అరవింద్ కేజ్రీవాల్. ఇటీవల ఆప్ పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయి. తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్.. కేజ్రీవాల్, ఆప్ పంజాబ్ కన్వీనర్ భగవంత్ మాన్‌ సమక్షంలో అమృత్‌సర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆయన పదవీ కాలం 2029 వరకు ఉన్నప్పటికీ రాజీనామా చేసి పార్టీలో చేరటం అక్కడ రాజకీయాలకు వేడిని రాజేసినట్టైంది. ఇక దీంతో అక్కడ ఆప్ పట్టుసాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: